లక్షమంది కార్మికులు క్వారంటైన్‌.. ప్రభుత్వం సంచలనం - MicTv.in - Telugu News
mictv telugu

లక్షమంది కార్మికులు క్వారంటైన్‌.. ప్రభుత్వం సంచలనం

March 29, 2020

UP Orders Quarantine For 1 Lakh Migrant Workers Returning From Other State Amid Covid-19 Lockdown

కరోనా వైరస్ ప్రభావంతో లక్ష మంది కార్మికులను క్వారంటైన్‌లో ఉంచాలని యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత మూడు రోజుల్లో స్వరాష్ట్రానికి తిరిగొచ్చిన యూపీ కార్మికులను 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచి.. వారికి అన్ని సౌకర్యాలూ కల్పించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆయా కార్మికుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను జిల్లాల మెజిస్ట్రేట్‌లకు పంపించింది. ఈ వ్యక్తులను నిర్బంధంలో ఉంచాలని, వారికి ఆహారం, ఇతర రోజూవారీ అవసరాలను తీర్చాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరోవైపు స్వరాష్ట్రానికి తిరిగి వచ్చాక కూడా క్వారంటైన్‌లో లేని కార్మికులు ఎవరైనా ఉంటే వారి వివరాలను ప్రభుత్వానికి తక్షణం పంపాలని గ్రామ అధికారులను, ఆశా వర్కర్లను ప్రభుత్వం కోరింది.