తబ్లిగీ-నవమి.. సీఎంను విమర్శించాడని జర్నలిస్టుపై కేసు - MicTv.in - Telugu News
mictv telugu

తబ్లిగీ-నవమి.. సీఎంను విమర్శించాడని జర్నలిస్టుపై కేసు

April 2, 2020

UP Police books The Wire editor over 'disreputable' Twitter remarks on Yogi Adityanath; website's founding editors call charges 'politically motivated'

కరోనా నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశ్నించిన ఓ జర్నలిస్టుపై పోలీస్ కేసు నమోదు అయింది. దేశంలో లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో రామజన్మభూమి పేరిట ఓ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టాలనుకున్న యోగి ఆదిత్యానాథ్ తీరును ప్రశ్నిస్తూ ‘ది వైర్’ వెబ్‌సైట్‌కు చెందిన ఎడిటర్ సిద్ధార్ద్ వరదరాజన్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ఆధారంగా పోలీసులు ఆయనపై ఐపీసీ సెక్షన్లు 188, 505 (2) కింద కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి మీద అగౌరవమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద కేసులు నమోదు చేశారు. ఆయన ఏం ట్వీట్ చేశారంటే.. ‘తబ్లీఘీ జమాత్ కార్యక్రమం జరిగిన రోజే ఆదిత్యనాథ్ కూడా రామనవమి ఉత్సవం పేరుతో మార్చి 25 నుంచి ఏప్రిల్ 2 వరకు కార్యక్రమం చేపట్టాలి అనుకున్నారు. కరోనా వైరస్ నుంచి రాముడు కాపాడతాడంటూ ఈ కార్యక్రమం చేయాలి అనుకున్నారు’ అని ట్వీట్‌ చేశారు. 

అంతటితో ఆగకుండా వరదరాజన్ మరో ట్వీట్‌ చేశారు. ‘లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 25న యోగి ఆదిత్యనాథ్ భారీ ప్రోగ్రాం నిర్వహిస్తే, భక్తులను కరోనా వైరస్ నుంచి ఆ రాముడు కాపాడతాడు. కానీ, యోగీని మాత్రం కాపాడడు అని అయోధ్య ఆలయ ట్రస్ట్‌ అధికారిక హెడ్, హిందుత్వ యోధుడు ఆచార్య పరమహంస చెప్పారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్లను సుమోటోగా తీసుకున్న ఫైజాబాద్ పోలీసులు సిద్ధార్ద్ వరదరాజన్ మీద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసును ‘ది వైర్’ వ్యవస్థాపక ఎడిటర్స్ ఖండించారు. ‘నామీద పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితంగా ఉంది’ అని సిద్ధార్థ్ వరదరాజన్ స్పందించారు.