ఆపరేషన్ దురాచారి.. సినిమా కాదు, యూపీలో.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆపరేషన్ దురాచారి.. సినిమా కాదు, యూపీలో..

September 25, 2020

bhgnnbh

యూపీలో పోకిరీల ఆటకట్టించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో కొత్త ఆలోచన చేశారు. మహిళలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ‘ఆపరేషన్ దురాచారి’ పేరుతో  వారికి చెక్ పెట్టడానికి సిద్ధం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోకిరీ చర్యలను ఊపేక్షించకూడదని పోలీసులను ఆదేశించారు. మహిళలతో చెడుగా ప్రవర్తించే వారి పరువు తీసే విధంగా చేసే కార్యక్రమం  రూపొందించారు. 

దీని ద్వారా మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వాళ్ల ఫోటోలతో పోస్టర్లు పెట్టనున్నారు. ఇలా చేయడం ద్వారా వారి ఆలోచనలో భయం, సిగ్గు మొదలు అవుతుందని భావిస్తున్నారు. కాగా ఇప్పటికే అక్కడ యాంటి రోమియో స్క్వాడ్‌లతో భద్రత ఏర్పాటు చేశారు. ‘ఆపరేషన్ శక్తి’ పేరుతోనూ ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయినా కూడా అత్యాచారాలు, వేధింపులు ఆగడం లేదు. పలు ప్రాంతాల్లో దాడులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో మరింత కఠినంగా ఉండాలని సీఎం పోలీసులను ఆదేశించారు.