ఎన్‌కౌంటర్ తరువాత..నేరస్తుడి కుమార్తెను దత్తత తీసుకున్న ఐజి - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్‌కౌంటర్ తరువాత..నేరస్తుడి కుమార్తెను దత్తత తీసుకున్న ఐజి

February 3, 2020

police....

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూకాబాద్‌లో కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ మానవత్వం చాటుకున్నారు. అనాథగా మిగిలిన నేరస్తుడి కూతురు గౌరిని దత్తత తీసుకోవడానికి ముందుకువచ్చారు. ఆ పాప బాగా చదువుకొని ఐపీఎస్‌ అధికారి కావాలని ఆకాంక్షించారు. గౌరి ప్రస్తుతం పోలీసులు పర్యవేక్షణలో ఫరూఖాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. 

ఫరూఖాబాద్ జిల్లాలోని కార్తియా గ్రామానికి చెందిన సుభాష్‌ బాథమ్‌.. హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్నాడు. ఇటీవల బెయిల్‌‌పై విడుదలై స్వగ్రామానికి వచ్చాడు. తాను జైలుకు వెళ్ళడానికి గ్రామస్తులే కారణం అనుకున్నాడో ఏమో.వాళ్లపై కోపంతో రగిలిపోయేవాడు. గ్రామస్తులపై ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో జనవరి 30న తమ కుమార్తె బర్త్‌డే వేడుకు రమ్మని స్థానికుల పిల్లలను తన ఇంటికి పిలిచాడు. అలా వచ్చిన మొత్తం 23మంది చిన్నారులను ఇంటిలో బంధించాడు. కాల్చిపారేస్తానని బెదరించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తొమ్మిది గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి సుభాష్‌ను ఎన్‌కౌంటర్ చేసి పిల్లలను కాపాడారు. ఈ క్రమంలో పారిపోతున్న సుభాష్ భార్య రూబీపై గ్రామస్తులు దాడి చేయడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో సుభాష్‌, రుబీల కుమార్తె గౌరి అనాథగా మిగిలిపోయింది.