కార్ డ్రైవింగ్‌లో బ్యాట్‌తో విన్యాసాలు.. పోలీసుల చేతికి చిక్కడంతో - MicTv.in - Telugu News
mictv telugu

కార్ డ్రైవింగ్‌లో బ్యాట్‌తో విన్యాసాలు.. పోలీసుల చేతికి చిక్కడంతో

May 31, 2022

వాహనాలను సురక్షితంగా మన గమ్యస్థానాలకు చేర్చేందుకు ఉపయోగించాలి కానీ.. ఇష్టానుసారంగా విన్యాసాలు చేస్తానంటే కుదరదు. అలా చేస్తే పోలీసులు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. యూపీలో ఇటీవల జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ వ్యక్తి తన లగ్జరీ కారును నడుపుతూ, కిటికీ బయటకు ఓ బేస్‌బాల్ బ్యాట్‌ను పెట్టి, విన్యాసాలు చేస్తున్నట్లు కనిపించిన వీడియో ఒకటి పోలీసులకు చేరింది. పోలీసులు అదెవరో కనిపెట్టి, కారును స్వాధీనం చేసుకుని, సదరు వ్యక్తిని నోయిడా సెక్టర్-24 పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళారు. లాకప్‌లో పడేశారు. చివరకు ఆ వ్యక్తి క్షమాపణలు చెప్తూ, తాను మరొకసారి ఇలాంటి విన్యాసాలు చేయబోనని హామీ ఇచ్చాడు. ‘‘రోడ్డుపైన విన్యాసాలు చేస్తే మేం మిమ్మల్ని వేటాడుతాం. మీ వాహనాన్ని జప్తు చేస్తాం. మిమ్మల్ని కటకటాల్లో పడేస్తాం’’ అనే శీర్షికతో పోలీసులు ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకున్నందుకు పోలీసులను ప్రజలు ప్రశంసిస్తున్నారు.