UP policeman fails to load rifle during surprise inspection
mictv telugu

గన్‌లో బుల్లెట్ లోడ్ చేయడం రాని ఎస్సై..ఐజీ ముందు అడ్డంగా బుక్కయ్యాడు..(వీడియో)

December 28, 2022

UP policeman fails to load rifle during surprise inspection

గన్‎లో బుల్లెట్ లోడ్ చేయడం రాని ఓ ఎస్సై ఉన్నతాధికారి ముందు అడ్డంగా బుక్కయ్యాడు. ఎదో బొమ్మల తుపాకీ అన్నట్టు గొట్టం ముందు భాగం నుంచి బుల్లెట్ లోపలికి తోసేయడానికి ప్రయత్నించి దొరికేశాడు. ఆ ఎస్సై తీరుతో అక్కడి అధికారులు షాకయ్యారు. చివరికి ప్రభుత్వంపై కూడా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. యూపీలో జరిగిన ఈ ఘటన వైరల్‎గా మారింది.

యూపీ సంత్ కబీర్ నగర్‌లోని పలు పోలీస్ట్ స్టేషన్‌లను ఐజీ ఆర్కే భరద్వాజ్ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. అకడి పోలీసులు పనితీరును గమనించారు. అందులో భాగంగా వారికి గన్ ఫైరింగ్ టెస్ట్ పెట్టారు. ఈ సమయంలో ఓ ఎస్సై అడ్డంగా దొరికిపోయాడు. బుల్లెట్ లోడు చేసి పైకి గన్ కాల్చమని ఐజీ చెప్పగా అతడు అయోమయంలో పడ్డాడు. బుల్లెట్ ఎలా లోడు చేయాలో కూడా కనీసం తెలియక ఇబ్బంది పడ్డాడు. చివరికి రైఫిల్ గొట్టం ద్వారా బుల్లెట్ లోపలికి తోసేశాడు. ఇది చూసిన ఐజీ ఆగ్రహానికి గురయ్యారు. ఎస్సైతో పాటు పక్కనున్న స్థానిక అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను సమాజ్ వాది పార్టీ ట్విట్టర్ పోస్ట్ చేస్తూ యూపీ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. ” యోగి జీ పోలీసులకు తుపాకీ ఎలా కాల్చాలో కూడా తెలియదు ! వారి అజ్జానం తారాస్థాయికి చేరింది. బిజెపి ప్రభుత్వంలో పేదలను, అమాయకులను వేధిస్తున్న క్రమశిక్షణ లేని పోలీసు ఎస్‌ఐకి తుపాకీ ఎలా ఉపయోగించాలో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు” అంటూ ట్వీట్ చేసింది.