మాస్కులను ఇలా వాడేశారు.. మొబైల్ షాపులో భారీ చోరీ - MicTv.in - Telugu News
mictv telugu

మాస్కులను ఇలా వాడేశారు.. మొబైల్ షాపులో భారీ చోరీ

September 19, 2020

gngn

కరోనా సమయం కదా.. చాలామంది ముఖాలకు మాస్కులు ధరిస్తున్నారు. చేతులకు శానిటైజర్లు వాడుతున్నారు. అయితే వీటిని కూడా తమకు అనువుగా మలుచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు దుండగులు. మొన్నటికి మొన్న ఒక బంగారం షాపులోకి వెళ్లిన దుండగులు చేతులకు శానిటైజర్ రాసుకుని మరీ దొంగతనం చేసిన విషయం తెలిసిందే. పీపీఈ కిట్లు సైతం ధరించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. మరికొందరైతే పూర్తి నగ్నంగా మారి దొంగతనాలకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది. 

తాజాగా ముఖానికి వాడే మాస్కులను కూడా దొంగలు వాడేశారు. వాటిని ముఖాలకు ధరించి దొంగతనానికి పాల్పడ్డారు. ఉత్తర ప్రదేశ్‌లోని అలీగడ్‌లో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖాలు కనిపించకుండా మాస్కులు ధరించి దొంగలు ఒక మొబైల్ షాపులోకి దూరారు. రూ.25 లక్షలు విలువచేసే మొబైల్స్‌ను దోచుకుని పోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై మొబైల్ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వారిని గుర్తించి పట్టుకునే పనిలో ఉన్నారు.