ప్రేమించి పెళ్లాడాడు.. మతం మారలేదని చంపేశాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమించి పెళ్లాడాడు.. మతం మారలేదని చంపేశాడు.. 

September 25, 2020

gnfgn

కులమతాలు వేరు అని ప్రేమ జంటలను వారి తల్లిదండ్రులు, బంధువులు అత్యంత కిరాతకంగా హత్యలు చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. తమ పరువు మర్యాదలను బజారుకు ఈడ్చారని దారుణాలకు తెగబడుతున్నారు. ఒక ప్రణయ్ హత్య కావచ్చు, ఒక హేమంత్ హత్య కావచ్చు.. వాటి వెనుకాల చిచ్చురేపింది కులమతాలే. అయితే తల్లిదండ్రులను ఎదురించి ప్రేమవివాహం చేసుకుని చాలామంది సంతోషంగా జీవిస్తున్నారు. ఎందుకంటే.. ఏ కులమతాలైతే తమ ప్రేమను అర్థం చేసుకోకుండా వెలేశాయో.. ఆ కంపుకు దూరంగా బతుకుతున్నారు కాబట్టి. కానీ, ఓ ఘటనలో ప్రాణంగా ప్రేమించి, కలకాలం తోడూనీడగా బతుకుదాం అని బాసలు చేసినవాడే ఆమెను కడతేర్చాడు. ప్రేమించేటప్పుడు అడ్డుపడని మతం పెళ్లయ్యాక అడ్డు అనిపించింది ఆ నీచుడికి. ఆమెను తన మతంలోకి మారమని పట్టుబట్టాడు. ఆమె మారనని చెప్పడంతో.. పెళ్లి చేసుకున్న నెల రోజులకే భార్యను హత్యచేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. 

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రీత్ నగర్‌కు చెందిన ప్రియా సోని అనే యువతి, ఇజాజ్ అహ్మద్ అనే యువకుడిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. పెళ్లి అవగానే భర్త ఇజాజ్ ఆమెను మతం మార్చుకోవాలని అన్నాడు. దీంతో భర్త ఆమె మీద మరింత ఒత్తిడి చేశాడు. దానికి ఆమె మతం మారే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో ఆమె మీద రగిలిపోయాడు. ఆమెను ప్రీత్ నగర్ ఏరియాలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి తన స్నేహితుడి సహాయంతో దారుణంగా చంపేశాడు. మృతురాలి తండ్రి ఆమెను గుర్తు పట్టడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బగ్గా నాలా పూల్ వద్ద పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.