విషాదం.. ఫోన్‌‌లో మాట్లాడుతూ పాములపై కూర్చుంది..  - MicTv.in - Telugu News
mictv telugu

విషాదం.. ఫోన్‌‌లో మాట్లాడుతూ పాములపై కూర్చుంది.. 

September 12, 2019

UP Woman.

జనం మొబైల్ ఫోన్లకు ఎంతలా బానిసలయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరికి రాత్రి నిద్రపోయే ముందు చూసే చివరి వస్తువు.. ఉదయం లేవగానే చూసే మొదటి వస్తువు మొబైల్ ఫోనే అవుతుండడం బాధాకరం. ఇంతలా మొబైల్ ఫోన్‌కు బానిసలవుతున్నారు. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ చుట్టూ పక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. తద్వారా అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. 

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ జిల్లాలోని రివాయ్ గ్రామానికి చెందిన గీత అనే మహిళ థాయిలాండ్‌లో ఉంటున్న భర్త జైసింగ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ చూసుకోకుండా రెండు పాములపై కూర్చుంది. భర్తతో ఫోనులో మాట్లాడుతూ మంచంపై కూర్చుంది. అయితే అప్పటికే ఆ మంచంపై రెండు పాములున్నాయి. ఆమె చూసుకోకుండా వాటిపైననే కూర్చుంది. దీంతో ఒక పాము ఆమెను కాటువేసింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. గ్రామస్థులు ఆ పాములను మట్టుబెట్టారు.