UP: Woman mistook insecticide for tea; 5 including father in law, husband, two children dead
mictv telugu

ఆమె చేసిన టీ ఐదుగురిని చంపేసింది.. తాను మాత్రం..

October 28, 2022

ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పురిలో విషాదం జరిగింది. ఓ ఇల్లాలు చేసిన టీ తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. టీ తాగిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలోని నాగ్లా కన్హై లో జరిగిందీ విషాద ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శివానందన్ భార్య రోజులానే టీ పెట్టి ఇంట్లో వారికి ఇచ్చింది. భాయిదూజ్ (భగినీ హస్త భోజనం) సందర్భంగా ఆమె సోదరుడు కూడా రావడంతో అతనికి కూడా ఉదయం సుమారు 8 గంటల సమయంలో టీ ఇచ్చింది. వ్రతం ఆచరిస్తున్న కారణంగా ఆమె టీ తాగకుండా స్నానం చేసేందుకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో వాళ్లందరూ అపస్మారక స్థితిలో కనిపించారు. ఆందోళన చెందిన రామామూర్తి బిగ్గరగా కేకలు వేసింది. కేకలు విన్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని వారందరిని ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త శివానందన్(35) , ఆమె కుమారులు శివాంగ్(6), దివ్యాన్ష్ (5), మామ రవీంద్రసింగ్ (55), మరో వ్యక్తి సోబ్రాన్ (45) మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. టీ తయారీకి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కోసం వాటిని పరీక్షలకు పంపించారు. రామామూర్తి స్ఫ్పహలోకి వెళ్లిందని.. కోలుకున్నాకా తదుపరి విచారణ ప్రారంభిస్తామని తెలిపారు. అయితే ఆమె పొరపాటున టీ పొడికి బదులు వరికి వాడే పురుగుల మందును కలిపిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.