ఉపాసన పెద్ద మనసు.. 150 వృద్ధాశ్రమాలకు సాయం - MicTv.in - Telugu News
mictv telugu

ఉపాసన పెద్ద మనసు.. 150 వృద్ధాశ్రమాలకు సాయం

May 2, 2022

మెగాస్టార్ చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన గురించి, ఆమె చేస్తున్న సమాజ సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ వైపు ఇంటి కోడలిగా బాధ్యతలు స్వీకరిస్తూనే, మరోవైపు సమాజ సేవ చేస్తున్నారు. కరోనా సమయం నుంచి మూగజీవాల పరిరక్షణకు ఆమె అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు అపోలో హాస్పిటల్స్ పనుల్లో బిజీగా బిజీగా ఉంటూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆమె నేటీకి సహాయసహకారాలను అందిస్తూ, మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఉపాసన కొంతమంది వృద్దులతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అతి త్వరలోనే బిలియన్ హార్ట్స్ బీటింగ్ అనే ఫౌండేషన్‌తో కలిసి, ఆమె దాదాపు 150 ఓల్డేజ్ హోమ్‌లకు సాయం చేయబోతున్నారని సమాచారం. ఇందుకోసం ఉపాసన 150 వృద్ధాశ్రమాలను దర్శించినట్లు తెలుస్తోంది. ఆ వృద్ధాశ్రమాలలో వృద్దులతో దిగిన ఫోటోలను ఆమె పోస్ట్ చేయడంతో ఈ మంచి పని గురించి బయటకు వచ్చింది.

మరోపక్క ఉపాసనకు సినిమాలు అంటే అంతగా ఇష్టముండదని పలు ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. కానీ, రాంచరణ్ చిత్రాలను మాత్రం సామాన్య అభిమానిలా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తుంటారు. అప్పుడప్పుడు రాంచరణ్ షూటింగ్‌లకు వెళ్తుంటారు. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల రోజున ఉపాసన థియేటర్లో సినిమాను వీక్షిస్తూ గాల్లోకి పేపర్లు ఎగిరేసిన విషయం తెలిసిందే.