రామ్‌చరణ్, ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. సుమారు పెళ్లైన 10 సంవత్సరాలు తర్వాత ఉపాసన తల్లి కాబోతున్నట్లు గత సంవత్సరం డిసెంబర్‌లో చిరంజీవి ట్విట్టర్ వేదికగ ప్రకటించారు. “హనుమాన్ జీ అశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.ఉపాసన, రామ్‌చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రేమతో..సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్ కామినేని” అని రాసుకొచ్చారు. ఈ ఒక్క ప్రకటనతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఆనందంలో మునిగితేలిపోయారు. బుల్లి రామ్ చరణ్ రాబోతున్నడంటూ సంబరపడిపోతున్నారు. ఇక త్వరలోనే ఉపాసన ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇప్పటి నుంచి మెగా ఫ్యామిలో సందడి నెలకొంది. తాజాగా ఉపాసనకు తన చిన్ననాటి ఫ్రెండ్స్ సీమంతం చేశారు. ఉపాసన మెడలో దండ వేసి ఆమెకు బహుమతులను అందజేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్‌తో పాటు పలువురు సన్నిహితులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉపాసన సీమంతం ఫోటోల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.