మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్, అపోలో అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన పెద్దలని ఒప్పించి పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి వీరిద్దరు ఎక్కడికెళ్లినా పిల్లలు ఎప్పుడు పుడతారనే దానిపైనే ప్రశ్నలు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరిగింది. ఓ దశలో వీరు పిల్లలు వద్దనుకుంటున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. ఇంతలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఉపాసన తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడితో పుకార్లకు చెక్ పడుతుందనుకుంటే మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. వైద్యరంగంలో ఎంతో అనుభవం ఉన్న ఉపాసన నేరుగా పిల్లలకు జన్మనివ్వడం లేదని.. సరోగసీ ద్వారా పిల్లలను కనబోతుందంటూ సోషల్ మీడియాలో మొన్నటి నుండి చర్చ నడుస్తుంది. భారతదేశంలో సరోగసీ చట్టాలకు సంబంధించి కొన్ని నిషేధాలు ఉండటం.. మొన్న నయనతార ఈ వివాదంలో చిక్కువకావడంతో రామ్ చరణ్ ఉపాసనలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
#RamCharan #Upasana pic.twitter.com/rvbkAc0ZAJ
— Hardin (@hardintessa143) December 19, 2022
సరోగసీపై నిషేధాల కారణంగా ఉపాసన ఎలా ముందుకు వెళ్తుందా అని చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఆమెకు సరోగసీ ద్వారా పిల్లలు పుట్టడం లేదని తేలిపోయింది. రూమర్స్ కి చెక్ పెట్టాలనో లేక సహజంగా షేర్ చేసిందో కానీ ఉపాసన కడుపుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఉపాసన కజిన్లలో ఒకరి పెళ్లి థాయ్లాండ్ లో జరిగింది. ఈ వేడుకల్లోరామ్ చరణ్ ఉపాసన దంపతులు పాల్గొన్నారు. అక్కడ సెలబ్రేషన్స్ కి సంబంధించి ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసింది. ఈ సందర్భంగా ఉపాసనకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోలలో ఉపాసన బేబీ బంప్ తో కనిపిస్తుండటం విశేషం. దీంతో ఉపాసన సరోగసీ అంటూ వార్తలకు స్ట్రాంగ్ కౌంటర్ పడినట్లయింది. ఇక బేబీ బంప్ పిక్స్ లో ఉపాసనను చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా.. త్వరలో జూనియర్ రామ్ చరణ్ రాబోతున్నాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.