మోదీకి ఉపాసన ట్వీట్‌పై చెర్రీ వివరణ  - MicTv.in - Telugu News
mictv telugu

మోదీకి ఉపాసన ట్వీట్‌పై చెర్రీ వివరణ 

October 27, 2019

Upasana ...

ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌ను నిర్ల‌క్ష్యం చేయొద్దంటూ ప్రధాని మోదీకి హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. గాంధీజీ 150వ జ‌యంతి సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవ‌ల ఉత్త‌రాది న‌టీన‌టుల‌తో ఓ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. దీనికి దక్షిణాదివారిని మాత్రమే ఆహ్వానించడంపై ఉపాసన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బాగా వైరల్ అయింది.

అయితే ఈ ట్వీట్ గురించి రామ్‌చ‌ర‌ణ్‌ను అడిగితే ‘ప్ర‌ధాని మోదీగారిని ఉపాసన ఎక్క‌డా విమ‌ర్శించ‌లేదు. గౌర‌వంగా త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది. దానిని ఖుష్బూగారు మ‌రో స్థాయికి తీసుకెళ్లారు. నిజానికి ఉపాస‌న ట్వీట్ గురించి నాకు ఎప్ప‌టికో తెలిసింది. దీనిపై త‌న‌ని అడ‌గ్గా.. మోదీకి ట్వీట్ చేస్తున్న‌ట్లు చెబితే నువ్వు వ‌ద్దంటావ‌ని చెప్ప‌కుండా చేశాను అంది. వాస్తవానికి ఇటువంటి విషయాలపై మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) మాట్లాడితే బాగుండేది’ అని చరణ్ తెలిపాడు.