కండోమ్స్ ఎందుకు వాడతారో చెప్పాల్సిన పనిలేదు. అవి పర్యావరణానికి హాని చేస్తాయనే గోల కూడా ఉంది. విషయం పక్కన బెడితో మెగా కోడలు కొణిదెల ఉపాసన కండోమ్స్‌తో తయారు చేసిన గౌను వేసుకుని కలకలం రేపారు. అది వేసుకుని ఊరికే ఉండలేదు. ఆ ఫొటోను తీసుకొచ్చి సోషల్ మీడియాలో పడేశారు. దీంతో ఆమె ధైర్యానికి జనం ఫిదా అయిపోతున్నారు. సమాజిక సేవ, ఆహారం, ఆరోగ్యం వంటి అంశాలపై ఉపాసన తరచూ పోస్టులు పెడుతుండడం తెలిసిందే.
Sustainable Fashion is the Future ! Dare to wear Scrap ?#covid19 reboot
・・・
Organza top Entirely created from textile scraps & rejects from local designers. #Madefromwaste Custom Latex Skirt (made from defected condoms)Creativity from #cancelledplansclub @mallikareddyg pic.twitter.com/KkkX1e55Qn
— Upasana Konidela (@upasanakonidela) May 19, 2020
ఫ్యాషన్ డిజైనర్లు పారేసి గుడ్డముక్కలు, లోపాలున్న కండోమ్స్‌తో తయారైన గౌనును ఆమె తొడుక్కున్నారు. అలాంటిది వేసుకుని ధైర్యముందా అని ప్రశ్నించారు. అది సస్టైనబుల్ ఫ్యాషన్ అని చెప్పుకొచ్చారు. ఈ డ్రస్ చూసి మెగా అభిమానులు హాట్సాప్ అంటున్నారు. ఫొటోలు తీయించుకోడానికి మాత్రమే బాగుంటుందని, రోడ్డుపై తిరగలేమని మరికొందరు అంటున్నారు. పబ్లిసిటీ కోసం కాకుండా పనికొచ్చే పని చేయాలని హితవు పలుకుతున్నారు.