Upasana's emotional tweet about her unborn child..!!
mictv telugu

తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన ఎమోషనల్ ట్వీట్..!!

January 12, 2023

Upasana's emotional tweet about her unborn child..!!

హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన మొదటిసారిగా ట్వీట్ చేశారు. తాను ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. రామ్ చరణతో కలిసి ఉపాసన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ టీంతో కలిసి దిగిన ఫోటోలను ఉపాసన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ టీంలో భాగమైనందుకు నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఇది దేశం గర్వించదగ్గ విజయం. ఈ ప్రయాణంలోను నేనూ పాలుపంచుకునేలా చేసిన రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళికి నా ధన్యవాదాలు. నాతో కలిసి నా బేబీ కూడా ఈ మధురానుభూతిని పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలు భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి. అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. ఈ పోస్టు చూసిన మెగా అభిమానులు ఆనందంతో మురిసిపోయారు. ఉపాసనకు కంగ్రాట్స్ చెబుతూ రీట్వీట్స్ చేశారు.