రామజన్మభూమిలో యోగి పూజలు - MicTv.in - Telugu News
mictv telugu

రామజన్మభూమిలో యోగి పూజలు

May 31, 2017


15 ఏళ్ల తర్వాత అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. హనుమాన్‌ ఆలయంలో యోగి ఆదిత్యనాధ్‌ దాస్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామమందిరం నిర్మించాలని భక్తులు నినాదాలు చేశారు. తొలిసారి రామజన్మభూమిని యూపీ సీఎం సందర్శించడం విశేషం. దాదాపు అరగంటకు పైగా ఆయన అక్కడే ఉన్నారు. ఆ తర్వాత సరయు నదిలో పూజలు చేశారు.