ఇంకొద్ది రోజులు ఆగితే పెట్రోల్ బంకులే ఉండవట...... - MicTv.in - Telugu News
mictv telugu

ఇంకొద్ది రోజులు ఆగితే పెట్రోల్ బంకులే ఉండవట……

August 12, 2017

ఇంకా కొద్ది రోజులు ఆగితే పెట్రోల్ బంక్ ల ముందు క్యూలు చూద్దమన్నా కన్పించక  పోవచ్చు.  ఇంటి దగ్గర బయలు దేరిన కారు ఆఫీసు అక్కడి నుండి నేరుగా మల్లా ఇంటికే చేరుకుంటుంది. ఒక్కరి కారని కాదు… ఒక్క రకం కారని కాదు.. అందరిది ఇట్లాగే ఉంటుంది. అన్నీ కార్లూ ఇట్లాగే ఉంటాయి. ఎందుకూ అంటే  2030నాటికి కల్లా మన దేశంలో పెట్రోల్, డీజీల్ కార్లు ఉండనే ఉండవట. కరెంట్ కార్లు తయారు చేయడానికి కేంద్ర ప్రభత్వం నిర్ణయం తీసుకున్నదట. ఇంకా కొద్ది  సంవత్సరాల్లో  కరెంట్ కార్లు మన దేశపు రోడ్లపైకి వస్తున్నాయి.  ఇంకొన్ని రోజులు ఆగితే పెట్రోల్ బంకులతో పనే ఉండదట.  అంతేకాదు ప్రతియేటా 12 లక్షల మంది ప్రాణాలు తీస్తున్న పొగ కూడా రోడ్లపై,  గల్లీల్లో ఉండనే ఉండదట.

కార్ల నుండి వచ్చే విషతుల్యమైన కాలుష్యం చూద్దామన్నా కన్పించదట. ఇదేకాదు వందల కోట్ల రూపాయలు కూడా ఆదా అవుతాయట. జనం ప్రాణాలు, డబ్బులు అన్నీ మిగులుతాయన్నమాట. దీనిపై కేంద్ర ప్రభుత్వం చకచకా చర్యలు తీసుకుంటున్నది. దీనిపై గతంలోనే నిర్ణయం తీసుకున్నది. దీన్ని అమలు చేయడమే మిగిలింది.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలక్ట్రిక్ కార్లున్నాయి. రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలోనే సూపర్ పవర్ గా ఎదుగుతున్న ఇండియాకు మంచి ఎసెర్ట్ కానున్నాయి కరెంట్ కార్లు. ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయట. రకరకాల కార్లు… రకరకాల ధరలు మాత్రం అట్లాగే ఉంటాయట. అటే రాబోయే రోజుల్లో ఇండ్లల్ల కరెంట్ ఛార్జర్లు ఉంటాయి. లేక పోతే కార్లకు ఛార్జింగ్ లు పెట్టే బంకులు వస్తాయి కావొచ్చు.