భారతదేశంలో గడిచిన 24 గంటల్లో కరోనా కొత్త కేసులు కాస్తంతా తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గతకొన్ని రోజులుగా 18వేలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. సోమవారం నమోదైన కరోనా కొత్త కేసులకు సంబంధించి అధికారులు నేడు బులెటెన్ విడుదల చేశారు.
విడుదల చేసిన బులెటెన్ వివరాల ప్రకారం..”గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,086 కేసులు నమోదైయ్యాయి. నిన్నటితో పోలిస్తే 18శాతం తక్కువ కేసులు వచ్చాయి. నిన్న 16వేలకుపైగా కేసులు వెలుగు చుశాయి. తాజాగా 12,456 మంది కోలుకున్నారు. మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1.14లక్షల మార్క్‌ను దాటింది.”
ఇక, తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ 4,35,31,650కేసులు నమోదైయ్యాయి. ఇందులో 4,28,91,933 మంది కోలుకోగా, 5.25లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,14,475 యాక్టివ్ కేసులున్నాయి. ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు విషయానికొస్తే.. 2.90శాతంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.