మేకే కదా అని వదిలేస్తే....2వేల నోట్ల కట్టని నమిలేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

మేకే కదా అని వదిలేస్తే….2వేల నోట్ల కట్టని నమిలేసింది..

June 7, 2017

అరటి పండ్లు కనిపిస్తే.. మేకలు లటక్కున లాగేసుకుంటాయి. చేతిలో ఉన్నా ఎగిరి మరి అందుకుంటాయి. ఆకలితో ఉన్న మేకకు నోట్ల కట్ట కనిపిస్తే..ఏం చేస్తుంది..ఊరుకుంటుందా…కాగితాల్లాగే తినేస్తుందా..?

ఈ మేక ఉత్తర్ ప్రదేశ్ ది..దాని యజమాని పేరు నర్వేశ్ కుమార్ పాల్.బిడ్డలాగే పెంచుకుంటున్నాడు. కొత్త ఇంటి నిర్మాణం పనుల్లో పడి మేత వేయడం మర్చిపోయాడు. ఇంకేముంది పసిపిల్లాడిలానే ఆకలితో అల్లాడింది. అప్ప‌టికే ఆక‌లితో ఉన్న మేక కు య‌జ‌మాని ప్యాంటు జేబులో ఉన్న రెండు వేల రూపాయ‌ల నోట్ల క‌ట్ట క‌నిపించేస‌రికి ల‌టక్కున అందుకుందట. 33 రెండు వేల నోట్లు ఉన్న కట్టను దబదబా న‌మిలి మింగేసింద‌ట‌. ఇది చూసి షాక్ తిన్న నర్వేష్ తేరుకునేలోపే అన్నింటినీ మింగేసిందట.

పాపం ఇంటి నిర్మాణం కోసం జేబులో ఉంచుకున్న డబ్బులవి. ఈ విష‌యం తెలుసుకున్న జనం మేక ను చూడ‌టానికి వస్తున్నారట. దానితో సెల్ఫీలు దిగి మ‌రి స‌ర్వేశ్ ను ఓదారాస్తున్నారట. కొంత‌మంది దాన్నిమీద కేసు పెట్టి జైల్లో తోసేయ‌మ‌న్నార‌ట‌. స‌ర్వేశ్ మాత్రం అది త‌న బిడ్డ లాంటిద‌ని… అది డ‌బ్బులు న‌మిలేసింద‌ని దాన్ని హింసించ‌డం క‌రెక్ట్ కాద‌ని చెప్పాడట.ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేక కదా అని వదిలేస్తే… ఇలాగే ఉంటది మరి..