నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్ ఇలా చేసుకోవచ్చు
రోజురోజుకీ మెరుగవుతున్న టెక్నాలజీతో నిత్య జీవితంలో ఎదురయ్యే సాధారణ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో లావాదేవీలపై ఇప్పటికే మన దేశం ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకుంది. అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు సైతం యూపీఐ లావాదేవీలలో మనలో సగం కూడా లేవు. అంతలా దూసుకుపోయిన యూపీఐ పేమెంట్స్ గురించి ఇప్పుడు మరో వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు నెట్ ఉంటేనే ట్రాన్సాక్షన్ సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు నెట్ లేకుండా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు.
ఇది మనలో చాలా మందికి తెలియదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కొత్త సర్వీసు సేవను ప్రారంభించింది. మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి *99# డయల్ చేస్తే బ్యాంకు పేర్ల లిస్ట్ వస్తుంది. అది సెలెక్ట్ చేసి ఐఎఫ్ఎస్ కోడ్ ఎంటర్ చేయగానే డబ్బులు పంపడం లేదా తీసుకోవడం, బ్యాలెన్స్ చెక్ చేయడం, ప్రొఫైల్, పెండింగ్ రిక్వెస్ట్, యూపీఐ పిన్, ట్రాన్సాక్షన్ వంటివి స్క్రీన్ మీద కనపడతాయి. అందులో మనకు కావాల్సింది ఎంపిక చేసుకోవాలి. డబ్బులు పంపాలనుకుంటే 1 ఎంటర్ చేసి అవతలి వ్యక్తి ఫోన్ నెంబర్, నగదు వివరాలు ఎంటర్ చేసి పిన్ నెంబర్ కొట్టడంతో ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.