UPI processes record 7.82 bn transactions in December, ends 2022 on a high
mictv telugu

అలవాటు పడ్డారు.. రికార్డ్ స్థాయిలో యూపీఐ లావాదేవీలు

January 3, 2023

 

UPI processes record 7.82 bn transactions in December, ends 2022 on a high

దేశ ప్రజలు డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడుతున్నారు. యూపీఐ సేవలను రికార్డు స్థాయిలో వినియోగించుకుంటున్నారు. ప్రతి నెలా వాటి సంఖ్య పెరుగుతూ ఉంది. డిజిటల్ సేవలు ప్రారంభించిన తొలినాళ్లలో (జులై 2016లో) కేవలం రూ.38లక్షల లావాదేవీలు జరగ్గా.. ప్రస్తుతం అది రూ.12.8లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది యూపీఐ ద్వారా ఏకంగా 7,404 కోట్ల లావాదేవీలు జరిగాయని.. వాటి విలువ రూ.125 లక్షల కోట్లకు చేరాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ పే మెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కూడా ధృవీకరించింది. 2022లో జరిగిన డిజిటల్ ట్రాన్సక్షన్స్ విలువ 125.94 ట్రిలియన్లుగా ఉందని కూడా NPCI వెల్లడించింది.

ఇక గత ఏడాది డిసెంబర్ నెల లావాదేవీలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. డిసెంబర్ నెలలో 7.82 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. వాటి విలువ 12.82 ట్రిలియన్లుగా ఉంది. నవంబర్ నెలతో పోల్చితే ఈ లావాదేవీలు 7.12 శాతం పెరిగినట్లు తెలిసింది. అదే విధంగా ఆదాయ పరంగా చూస్తే 7.73 శాతం పెరుగుదల కనిపించింది. గత రెండేళ్లుగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చాలా జోరుగా జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు విరివిగా ఉపయోగిస్తున్నారు.

2021లో మొత్తంగా 38 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. వాటి విలువ 71.54 ట్రిలియన్లు. 2022లో ఆ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఊహించని స్థాయిలో పెరిగింది. ఏకంగా 125.94 ట్రిలియన్ల మొత్తానికి చెందిన 74 బిలయన్ల లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ వెల్లడించింది. యూపీఐ సేవలు 2016 ఏప్రిల్ 11న ప్రారంభం అయ్యాయి. అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ సేవలను ప్రారంభించారు. యూపీఐ సేవలు ప్రారంభించిన మొదట్లో ఒక బిలియన్ లావాదేవీలు జరగాలంటే కొన్ని నెలలు పట్టేది. ప్రస్తుతం అత్యంత వేగంగా లావాదేవీల సంఖ్య పెరుగుతోంది.