స్నేక్ డ్యాన్స్ చేశాడని వరుడ్ని వదిలేసింది..! - MicTv.in - Telugu News
mictv telugu

స్నేక్ డ్యాన్స్ చేశాడని వరుడ్ని వదిలేసింది..!

June 30, 2017

యూపీలో ఈ మధ్య విచిత్ర కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. మొన్న వరుడు మందేశాడని ఓ అమ్మాయి వదిలేస్తే…ఇవాళ నాగినీ డ్యాన్స్ చేశాడని మరో అమ్మాయి పెళ్లి వద్దన్నది. వరుడు సరదాగా చేసిన స్నేక్‌ డ్యాన్స్‌ అతని పెళ్లి ఆగేలా చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కి చెందిన ప్రియాంకకి ఇదే ప్రాంతానికి చెందిన మిశ్రాకి మంగళవారం వివాహం నిశ్చయమైంది. వరుడి కుటుంబీకులు మండపానికి వస్తుండగా అక్కడే ఉన్న డీజే సరదాగా నాగిని మ్యూజిక్‌ పెట్టాడు. దాంతో మిశ్రా నాగినిలా డ్యాన్స్‌ చేస్తూ పాములా బుసలు కొట్టాడు. అతన్ని ఆపాల్సిందిపోయి స్నేహితులు మిశ్రాపై డబ్బులు విసురుతూ ఎంజాయ్‌ చేశారు.అందరూ తెగ ఎంజాయ్ చేసిన మిశ్రా వింత ప్రవర్తనకు భయపడి వధువు ప్రియాంక పెళ్లి ఆపేసింది. అప్పటికీ మిశ్రా సరదాగా అలా చేశాడని అతని తల్లిదండ్రులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ప్రియాంక మాత్రం ఒప్పుకోలేదు. దాంతో చేసేదేం లేక అంతా ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజే ప్రియాంక మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది.