తెనాలి : తల్లితో అక్రమ సంబంధం.. కూతురు కోసేసింది - MicTv.in - Telugu News
mictv telugu

తెనాలి : తల్లితో అక్రమ సంబంధం.. కూతురు కోసేసింది

May 3, 2022

గుంటూరు జిల్లా తెనాలిలో ‘ఉప్పెన’ సినిమా తరహా దారుణ ఘటన జరిగింది. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కూతురు ఆ వ్యక్తి మర్మాంగాలను కోసేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీన్ని గమనించిన మహిళ కుమార్తె అవకాశం కోసం వేచి చూసింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి బాగా మద్యం తాగిన రామ చంద్రారెడ్డి మహిళ ఇంటికి వచ్చి ఆమెతో కలిసి డాబాపై నిద్రపోతున్నాడు. ఇదే అవకాశంగా భావించిన కూతురు తొలుత విచక్షణారహితంగా దాడి చేసి, అనంతరం బ్లేడుతో రామచంద్రారెడ్డి మర్మాంగాలను కోసేసింది. దీంతో నొప్పి తట్టుకోలేక పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు స్పందించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.