దళిత పెళ్లికొడుకుపై రాళ్లదాడి.. - MicTv.in - Telugu News
mictv telugu

దళిత పెళ్లికొడుకుపై రాళ్లదాడి..

February 17, 2020

Gujarat

ఎన్ని చట్టాలు తీసుకొని వచ్చినా ఇంకా దళితులపై అగ్రకులాల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్‌లోని బనాస్కంఠ ప్రాంతంలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. పెళ్లి చేసుకోవడానికి గుర్రంపై వెళ్తున్న దళిత వరుడిపై అగ్రకులాకు చెందిన ప్రజలు రాళ్ల వర్షం కురిపించారు. 

ఆకాశ్ కోటియా అనే వ్యక్తి దళిత వ్యక్తి వివాహం నిశ్చయమవడంతో గుర్రంపై అతను పెళ్లిమండపానికి బయలుదేరాడు. దీన్ని చూసిన కొందరు అగ్రవర్ణాల ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఆకాశ్‌పై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఆకాశ్‌కు స్వల్పగాయాలయ్యాయి. దీంతో పోలీసు రక్షణ మధ్య ఆకాశ్ వివాహం జరపాల్సివచ్చింది. ఈ దాడి ఘటనలో పోలీసులు 11మందిని అరెస్టు చేశారు. కాగా, 27ఏళ్ల ఆకాశ్ భారత ఆర్మీలో పనిచేస్తున్నాడు. కశ్మీర్‌లో జవానుగా పనిచేస్తున్న అతను వివాహం చేసుకోవడానికి స్వస్థలానికి వచ్చాడు.