యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Union Public Service Commission) సివిల్ సర్వీసెస్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 01, 2023న విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు సాయంత్రంల 6 గంటలకు దరఖాస్తు గడువు ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులెవరైనా UPSC CSE ప్రీ ఎగ్జామ్‌కు అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లేదా upsconline.nic.in. వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీ దరఖాస్తులో ఏవైన తప్పులు దొర్లితే… అప్లికేషన్ కరెక్షన్ విండో మరుసటి రోజున అంటే ఫిబ్రవరి 22న ఓపెన్ అవుతుంది. ఈ విండో సహాయంతో అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 28 వరకు సవరణలు చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు ప్రస్తుతం డీగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. నోటిఫికేషన్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ లతోసహా వివిధ సివిల్ సర్వీసులకు సంబంధించి మొత్తం 1,105 ఖాళీలున్నట్టు యూపీఎస్సీ ప్రకటించింది.
ఖాళీల వివరాలు :1105
సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్) పరీక్ష 2023
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ ప్రచురణ: 01-02-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 21-02-2023 సాయంత్రం 06:00 వరకు
వయస్సు :
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 3 2 సంవత్సరాలు
అర్హతలు:
అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే.
ఎంపిక విధానం:
రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్),
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: మే 28, 2023
ఇంటర్వ్యూ
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు రుసుము: ఓబీసీ/ఇతర అభ్యర్ధులకు రూ 100
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.