కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త. వివిద కేంద్ర మంత్రిత్వ శాఖలు, అనుబంధ విభాగాల్లో దాదాపు 75పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. యూపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 73 ఫోర్‌మాన్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ , అసిస్టెట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్, కార్మిక, ఉపాధి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లేదా ఇన్ స్టిట్యూట్ నుంచి పోస్టులను బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
యూపీఎస్సీ ద్వారా ప్రకటించిన పై పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు కమిషన్ అప్లికేషన్ పోర్టల్, upsconline.nic.inలో అందించిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 11, శనివారం నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు మార్చి 2, 2023 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు రూ. 25 దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఖాళీల వివరాలు
ఫోర్‌మాన్ – 13 పోస్టులు
కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ (ఉపాధి) – 12 పోస్టులు
ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్‌లో అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్ – 47 పోస్టులు
లేబర్ డిపార్ట్‌మెంట్‌లో లేబర్ ఆఫీసర్ – 1 పోస్ట్
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచిన నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.