UPSC: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్..!! - Telugu News - Mic tv
mictv telugu

UPSC: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్..!!

February 1, 2023

UPSC

 

ఈ అర్హతలు ఉండాల్సిందే..!!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)జియోలాజికల్ సర్వేలో పది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్ స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ, ఎంబీఏ, పీజీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. నోటిఫికేషన్ లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అభ్యర్థుల వయస్సు పోస్టులను బట్టి 30 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి.

UPSC Notification 2023 for Administrative Officer Posts

 

ఈ పోస్టులకు అర్హులైనవారు ఆన్ లైన్ లో ఫిబ్రవరి 16నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ. 25 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నోటిఫికేషన్ సూచించిన విధంగా జీతం చెల్లిస్తారు. మరిన్ని వివరాలను https://www.upsc.gov.in/ అధికారిక నోటిఫికేషన్ లో చూడవచ్చు.

ఖాళీలు

మార్కెటింగ్ స్పెషలిస్ట్ లేదా ఎకనామిస్ట్ పోస్టులు 1
ఆర్కైవిస్ట్ ఓరియంటల రికార్డ్స్ పోస్టులు 1
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు 8.