UPSC EPFO Notification 2023 : ఈపీఎఫ్‎లో 557 ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్..ఈ అర్హతలు ఉండాల్సిందే..!! - MicTv.in - Telugu News
mictv telugu

UPSC EPFO Notification 2023 : ఈపీఎఫ్‎లో 557 ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్..ఈ అర్హతలు ఉండాల్సిందే..!!

February 26, 2023

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్..సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం దరఖాస్తు ప్రక్రియను ఫిబ్రవరి 21న ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది యూపీఎస్సీ. ఫిబ్రవరి 25న మరో ప్రధాన రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో 577 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ (EO), అకౌంట్స్ ఆఫీసర్ (AO), 159 అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కమిషన్ నోటీసు ప్రకారం, ఫిబ్రవరి 25న UPSC ప్రకటన చేసిన 577 పోస్టుల కోసం EPFO ​​నోటిఫికేషన్ 2023ని జారీ చేస్తుంది. దీనితో దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 17 చివరితేదీ.

అర్హత:

పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా ఇన్ స్టిట్యూట్ నుంచి ఏదైనా డిగ్రీలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. నోటిఫికేషన్ లో సూచించిన సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. దరఖాస్తుదారులు వయస్సు ఈవో, ఏవో పోస్టులకు 30 ఏళ్లు, ఏపీఎఫ్సీ పోస్టులకు 35ఏళ్లకు మించి ఉండకూడదు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కమిషన్ అప్లికేషన్ పోర్టల్, upsconline.nic.inలో నమోదు చేసుకుని, ఆపై రిజిస్టర్డ్ వివరాలతో లాగిన్ చేయడం ద్వారా తమ దరఖాస్తును సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో నిర్ణీత రుసుమును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత అభ్యర్థులు అదే సాఫ్ట్ కాపీని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయాలి.