UPSC Prelims Result 2022 declared, list of candidates shortlisted released
mictv telugu

సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

June 22, 2022

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) జూన్ 5న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2022 పరీక్షల్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ పరీక్షకు ఈసారి 8 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన మూడు వారాల లోపే సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది యూపీఎస్‌సీ. సివిల్స్‌ మెయిన్స్‌కు మొత్తం 13,090 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. సెప్టెంబర్‌ 16 నుంచి 21 వరకు సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ లో లేదా యూపీఎస్‌సీకి చెందిన మరో వెబ్‌సైట్ https://upsconline.nic.in/ లో కూడా ఫలితాలు చెక్ చేయొచ్చు. ఈ వెబ్‌సైట్స్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో Result – CIVIL SERVICES (PRELIMINARY) EXAMINATION, 2022 లింక్ పైన క్లిక్ చేయాలి.
పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అభ్యర్థులు తమ రోల్ నెంబర్ సెర్చ్ చేసి ఫలితాలు చూడొచ్చు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినవారికి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్‌ని త్వరలోనే విడుదల చేయనుంది యూపీఎస్‌సీ.