సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు వీళ్లే  - MicTv.in - Telugu News
mictv telugu

సివిల్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు వీళ్లే 

August 4, 2020

UPSC Result 2019 Pradeep Singh tops, Jatin Kishore 2nd, Pratibha Verma 3rd check toppers' full list here.

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి దేశంలోని అత్యున్నత సర్వీసుల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్-2019లో మన తెలుగు తేజాలు సత్తా చాటారు. మంగళవారం సివిల్స్ పరీక్షా ఫలితాలు  వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో హర్యానాలోని సోనేపట్‌కు చెందిన ప్రదీప్ సింగ్ టాపర్‌గా నిలిచాడు. మొత్తం 829 మంది వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన దాత్రి రెడ్డి 46వ ర్యాంక్ సాధించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల పరిధిలోని గుండ్ల బావి గ్రామానికి చెందిన దాత్రి, క్రితం ఫలితాల్లో 283వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌ ట్రైనింగ్‌లో ఉంది. ఇక మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం బుద్దారం గ్రామానికి చెందిన కట్టా రవితేజ సివిల్స్‌లో 77వ ర్యాంకు సాధించాడు. మంద మకరంద్‌(సిద్దిపేట్) 110వ ర్యాంక్‌ సాధించగా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తంగడపల్లి గ్రామానికి చెందిన బడేటి ప్రకాష్‌ గౌడ్‌ 218వ ర్యాంక్‌ సాధించాడు. 

మంచిర్యాల జిల్లాలోని బెల్లింపల్లికి చెందిన సిరిశెట్టి సంకీర్త్‌ 330వ ర్యాంక్‌ సాధించగా.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఇర్లపూడి గ్రామానికి చెందిన బానోత్‌ మృగేందర్‌ లాల్‌ 505 ర్యాంకు సాధించాడు. గతేడాది సివిల్స్‌ ఫలితాల్లో మృగేందర్ 551 ర్యాంకు సాధించాడు. ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం మహారాష్ట్రలో పనిచేస్తున్నాడు. అలాగే సిద్దిపేట జిల్లాకు చెందిన డి. వినయ్‌కాంత్‌ 516వ ర్యాంక్‌ సాధించాడు.

ర్యాంకులు ఇలా..

-పి.ధాత్రి రెడ్డి (46వ ర్యాంకు)

-మల్లవరపు సూర్యతేజ(76వ ర్యాంకు)

-కట్టా రవితేజ (77వ ర్యాంకు)

-ఎంవీ సత్యసాయి కార్తీక్(103వ ర్యాంకు)

-మంద మకరంద్ (110వ ర్యాంకు)

-తాటిమాకుల రాహుల్ రెడ్డి (117వ ర్యాంకు)

-కె.ప్రేమ్ సాగర్ (170వ ర్యాంకు)

-శ్రీచైతన్య కుమార్ రెడ్డి (250వ ర్యాంకు)

-చీమల శివగోపాల్ రెడ్డి (263వ ర్యాంకు)

-యలవర్తి మోహన్ కృష్ణ (283వ ర్యాంకు)

-ఎ.వెంకటేశ్వర్ రెడ్డి (314వ ర్యాంకు)

-ముత్తినేని సాయితేజ (344వ ర్యాంకు)

-ముక్కెర లక్ష్మీపావన గాయత్రి (427వ ర్యాంకు)

-కొల్లాబత్తుల కార్తీక్ (428వ ర్యాంకు)

-ఎన్.వివేక్ రెడ్డి (485వ ర్యాంకు)

-నీతిపూడి రష్మితారావు (534వ ర్యాంకు)

-కోరుకొండ సిద్ధార్థ (566వ ర్యాంకు)

-సి.సమీర్ రాజా(603వ ర్యాంకు)

-కొప్పిశెట్టి కిరణ్మయి (633వ ర్యాంకు)