గుడ్ న్యూస్.. సివిల్స్ ఫలితాలు రిలీజ్.. అమ్మాయిలే టాప్ - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్ న్యూస్.. సివిల్స్ ఫలితాలు రిలీజ్.. అమ్మాయిలే టాప్

May 30, 2022

సివిల్ సర్వీసెస్ – 2021 ఫలితాలను యూపీఎస్పీ సోమవారం విడుదల చేసింది. మొత్తంగా 685 మందిని ఎంపిక చేసినట్టు తెలిపింది. ఈ ఫలితాల్లో అమ్మాయిలు తమ ఆధిపత్యాన్ని చాటారు. నలుగురు టాపర్లుగా అమ్మాయిలే నిలవడం వారి హవాకు నిదర్శనం. టాపర్‌గా శ‌ృతిశర్మ, రెండో ప్లేస్‌లో అంకితా అగర్వాల్, మూడో ర్యాంకర్ గామిని సింగ్లా నిలిచారు.

మన వరకు చూస్తే యశ్వంత్ కుమార్ రెడ్డి 15వ స్థానంలో ఉన్నారు. 24వ ర్యాంకులో పూసపాటి సాహిత్య, 25 శృతి రాజ్యలక్ష్మి, 38 రవి కుమార్, 56 కొప్పిశెట్టి కిరణ్మయి, 63 పాణిగ్రహి కార్తీక్, 69 గడ్డం సుధీర్ కుమార్, 83 శైలజ, 87 శివానందంలు ఉన్నారు. ఎంపికయిన వారికి ఈ మెయిల్ ద్వారా కూడా సమాచారం అందిస్తామని యూపీఎస్పీ తెలిపింది.