శబరిమల యాత్రికులపై  కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

శబరిమల యాత్రికులపై  కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

November 18, 2019

శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్న నేపథ్యంలో కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కూడా ఆలయాన్ని సందర్శించామని నిరూపించుకోవడానికి కొందరు భక్తుల ముసుగులో అర్బన్ నక్సలైట్లు, అరాచకవాదులు, నాస్తికులు శబరిమల ఆలయానికి వెళుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రస్తుతం శబరిమల ఆలయాన్ని సందర్శిస్తున్నవారిలో నాస్తికులు, అర్బన్ నక్సల్స్, అరాచకవాదులు ఉన్నారని ఆయన తెలిపారు. అటువంటి ముసుగు వ్యక్తులను విచారించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాగా, గతేడాది స్వామి దర్శనానికి వచ్చిన కొంతమంది మహిళా భక్తులకు కేరళ ప్రభుత్వం భద్రత కల్పించింది. కానీ, ఈసారి మాత్రం భద్రత కల్పించేదిలేదని తెగేసి చెప్పింది.