urfi javed and rakhi sawant trolled by netizens for their dressing
mictv telugu

ఇదేం డ్రస్సు.. పాపులర్ అయ్యేందుకు వేరే దారి లేదా?

June 6, 2022

urfi javed and rakhi sawant trolled by netizens for their dressing

మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో కాస్త గ్లామర్ కల్చర్ ఎక్కువే. పాపులర్ అయ్యేందుకు సమయం,సందర్భంతో పని లేకుండా అంగాంగ ప్రదర్శనలు చేస్తారు కొందరు. ఫోటో షూట్‌ల పేరుతో వాటిని సోషల్ మీడియాలోకి వదులుతారు. ఇంకేముంది.. లైక్‌లు, షేర్‌లు మాత్రమే కాదు.. కొన్ని సార్లు ట్రోలింగ్‌కి కూడా గురవుతున్నారు. అలాంటి హీరోయిన్లలో ఉర్ఫీ జావేద్ , రాఖీ సావంత్‌లు ముందుంటారు. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కి హాజరైన వీరిద్దరూ వారి డ్రెస్సింగ్‌తో అందరికీ మతి పొగొట్టారు. చిట్టి పొట్టి బట్టల వరకూ అయితే ఓకే.. కానీ స్కిన్ షో మోతాదు ఎక్కువై బోల్డ్‌గా కనిపించారు. అదే సమయంలో ఇంటర్వ్యూ ఇస్తూ.. ఆ దుస్తులు కాస్త కంఫర్టబుల్‌గా లేక ఇబ్బంది పడ్డారు.

సరిగ్గా అప్పుడే కొందరు ఫోటోలు క్లిక్ మనిపించారు. అంతటితో ఆగకుండా ఈ ఫోటోలను మళ్లీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఈ ఇద్దరు హీరోయిన్లను నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే పాపులర్ కోవడం కోసం ఇలాంటి చీప్ స్టంట్లు చేస్తున్నారని మరి కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఉర్ఫీ నటనతో కాకుండా ఇలాంటి డ్రెస్సులతో నే ఎక్కువగా ఫేమస్ అయిందని ఎద్దేవా చేస్తున్నారు. పాపులర్ అయ్యేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రస్తుతం ఈ ఇద్దరి చేతిలో సినిమాలు లేవు.. అలాగే ఎటువంటి మూవీ ఆఫర్లు కూడా రావడం లేదు.