Urfi Javed Gets Trolled Again for Wearing Black Striped Bodysuit,
mictv telugu

‘అది డ్రెస్సేనా.. లేక బాడీ పెయింటింగా.?’… డౌట్ ఫ్రమ్ నెటిజన్స్

February 9, 2023

ఉర్ఫీ జావెద్… ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె (ఫ్యాషన్) కాస్ట్యూమ్స్. ఇంతకుముందెవ్వరూ వేసుకోని, ఆందాలు ఆరబోసేలా డిఫరెంట్ టైప్ డ్రెస్సులేస్తూ సోషల్ మీడియాలో తన ప్రతాపం చూపిస్తుంటుంది. 4 రోజుల క్రితం ముందు నుంచి కార్పొరేట్ స్టైల్‌లో, వెనుక నుంచి బికినీ మోడల్ డ్రెస్‌తో అందరిని మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. తాజాగా ఈ బ్యూటీ నెటిజన్లపై మరో అస్త్రాన్ని ప్రయోగించింది. ఈసారి ఓ కొత్త వీడియోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. నన్ను పరిశీలించారా? అంటూ నెటిజన్లను ప్రశ్నించింది.

కొన్ని వీడియోల్లో విదేశీయులు ఒంటి మీద ఎలాంటి క్యాస్టూమ్స్ వేసుకోకుండా కేవలం బాడీ పెయింటింగ్ తో దానిని ఒక డ్రెస్ ల భ్రమింపజేస్తారు. అలాంటి లుక్స్ తరుచుగా చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఉర్ఫీ కూడా అలాంటి లుక్ లోనే దర్శనం ఇచ్చింది. ఆ వీడియో చూసిన వారికి అది డ్రెస్ నా లేదంటే బాడీ పెయింటింగ్ నా అనేది అర్ధం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఆ లుక్ లో రొమాంటిక్ స్టిల్స్ తో ఉర్ఫీ జావెద్ రెచ్చిపోయి ఫోజులు ఇచ్చింది. మీకు కూడా అది డ్రెస్సా? కాదా? అనే అనుమానం ఉంటే ఆ వీడియో ఓ సారి చూసి ఆమె అడినట్లే ఓసారి పరిశీలించి చెప్పండి.