Urfi Javed is allergic to clothes, internet sensation gets boils after wearing woollen outfits
mictv telugu

బట్టలు వేసుకోవడం అలెర్జీ అంటుంది ఉర్ఫీ జావెద్!

January 9, 2023

Urfi javed, allergy, clothes, actress, biggboss, model, Bollywood, cinema, serial

ఉర్ఫీ జావెద్.. ఈమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈమె బట్టల గురించి నెట్టింట ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ నటి బట్టలు వేసుకోవడం తనకు అలెర్జీ అంటుంది. ఫ్యాషన్ స్టేట్మెంట్ కు పేరుగాంచిన నటి, విచిత్రమైన డ్రెస్సింగ్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. టీవీ సీరియళ్లతో మొదలైన ఈమె ప్రస్థానం, ఆ తర్వాత సినిమాలకు దారి తీసింది. 2021లో బిగ్ బాస్ ఓటీటీలో కూడా కనిపించింది. అయితే ఇప్పుడు ఈమె దుస్తులతో వివాదంలోకి వెళ్లే ఈమె ఒక పోస్ట్ పెట్టింది. ముందుగా తన కాళ్లను ఫోటో తీసి ‘ చలికాలంలో ఎవరికైనా అలర్జీ వస్తుందా?’ అని క్యాప్షన్ పెట్టింది. తర్వాత మరొక వీడియోను షేర్ చేసింది.

ఈ వీడియోలో..
‘నేను ఉన్ని బట్టలు వేసుకోవడం వల్లే దద్దుర్లు వచ్చాయి. ఇప్పటికైనా తెలుసుకోండి నాకు బట్టలు అంటే అలర్జీ. ఉన్ని దుస్తులు వేసుకోవడం వల్ల ఒళ్లంతా పుండ్లు వచ్చేశాయి. కాబట్టే నేను బట్టలు వేసుకోలేను. నాకు ఈ పరిస్థితి ఉంది. బట్టలు వేసుకున్న వెంటనే నా శరీరం స్పందించడం మొదలుపెడుతుంది. దీనికి రుజువు ఇదే. కాబట్టి నేను నగ్నంగా ఉండడానికి ఇష్టపడుతాను’ అంటూ ఉర్ఫీ బోల్డ్ కామెంట్ పెట్టింది.

ట్రోల్స్ కూడా..
ఉర్ఫీ జావెద్ మరొక పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ లెజెండ్ రచయిత అయిన జావెద్ అక్తర్ తో ఒక సెల్ఫీ ఫోటో పెట్టింది. దీనికి ‘పైనల్ గా నా తాతయ్యని కలిశాను. ఆయన ఎంతో ఓపికగా అందరితో సెల్ఫీలు దిగుతున్నాడు. ఆయన ముఖంలో చిరునవ్వు మాత్రం చెక్కు చెదరడం లేదు. ఆయనని చూస్తుంటే వావ్ అనకుండా ఉండలేం’ అంటూ పోస్ట్ పెట్టింది. ఆయనను తాత అని సంబోధించడం పట్ల నెటిజన్లు ఉర్పీ ని ట్రోల్ చేస్తున్నారు. ఇక పై జావెద్ గారు తమ ఆస్తిని మూడు ముక్కలు చేయాల్సి ఉంటుందంటూ కామెంటున్నారు.

నాయకులతో గొడవ..
బీజేపీ నాయకురాలు, మహారాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు చిత్రా కిషోర్ వాఘ్ ఉర్ఫీ పై పోలీసు ఫిర్యాదు చేసింది. ఈ నటి అసభ్యకరమైన డ్రెస్సింగ్ గురించి సోషల్ మీడియా నుంచే అనేక పోస్టులను తీసుకొని కేసు పెట్టింది. దానికి ఉర్ఫీ కూడా చాలా ఘాటుగా స్పందించింది. ‘నాకు విచారణ అక్కర్లేదు. ముందుగా మీ కుటుంబ సభ్యుల ఆస్తులను బయటపెడతారా? నేను జైలుకు వెళ్లడానికి అయినా సిద్ధం. ఒక రాజకీయ నాయకుడు ఎంత సంపాదిస్తాడో, ఎక్కడ నుంచి సంపాదిస్తాడో ప్రపంచానికి తెలియాలి. ఇలాంటి ఫిర్యాదుతో నా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాను’ అంటూ ఉర్ఫీ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.