Urfi Javed made bold comments on her body
mictv telugu

మగాడి వెంట కాదు మనీ వెంట పడండి.. ఉర్ఫీ బోల్డ్ కామెంట్స్

February 24, 2023

Urfi Javed made bold comments on her body

వెరైటీ దుస్తులతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి, మోడల్ ఉర్ఫీ జావేద్ తాజాగా బోల్డ్ కామెంట్స్ చేసింది. మహిళలు ఎదగడానికి మగాడి వెంట కాకుండా డబ్బు వెంట పడాలని హితవు పలికింది. డర్టీ మ్యాగజైన్ కవర్ ఫోటో షూట్‌లో ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉర్ఫీ తన మాటలతో హద్దులు దాటేసింది. తన శరీరాన్ని బెడ్ షీట్ వెనుక దాచుకోవడానికి ఇష్టపడనని అందరికీ చూపించడానికే ఇష్టమని తెలిపింది. చూపించడానికి తన వద్ద (ఛాతీని చూపిస్తూ) ఏమీ లేకపోయినా తరచూ వివాదాస్పదమవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

‘శరీరంలో ఆ భాగం పెద్దదిగా ఉంటే నేను ఎక్కడ ఉండేదాన్నో ఒక్కసారి ఊహించుకోండి’ అంటూ హాట్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘అయినా నేనేమీ చూపించకూడనిది చూపించడం లేదు. అయినా కొందరికి ఎందుకు ఇబ్బంది కలుగుతుంతో అర్ధం కాదు. రెచ్చగొట్టే వస్త్రధారణ వేసుకోవడం లేదు. అందరి కళ్ళూ నా మీదే ఉండాలనే ఓ స్వార్ధం అంతే’ నని తేల్చి పడేసింది. అటు తన చిన్నప్పుడు తండ్రి వల్ల నరకం అనుభవించానని, బతకడానికే డబ్బులు సరిపోయేవి కావని గుర్తు చేసుకుంది. మోడ్రన్‌గా బతకాలని తనకున్న ఆశ కానీ తండ్రి ఒప్పుకునేవాడు కాదని గతాన్ని వివరించింది. తనకు ఫ్యాషన్ నాలెడ్జ్ లేకపోయినా ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలుసన్నారు.