పొట్టి పొట్టి డ్రెస్సులతో పాపులర్ అయిన బిగ్ బాస్ పార్టిసిపెంట్, మోడల్ ఉర్ఫీ జావెద్ తనను ట్రోల్ చేసేవారి తీరును ఎండగట్టింది. తాను ఏ డ్రెస్ వేసుకున్నా విమర్శిస్తున్నారంటూ మండిపడింది. అవే డ్రెస్సులను వేరే సినీ తారలు వేసుకుంటే మాత్రం వారిని పొగుడుతూ కామెంట్లు చేస్తారని దుయ్యబట్టింది. విషయం ఇదీ.. ఇటీవల ఉర్ఫీ జావేద్ సన్నని బట్టలేసుకొని ఫోటో షూట్ చేసింది. దానికి ఒక నెటిజన్ స్పందిస్తూ ‘నువ్వు వేసుకునే బట్టల కంటే దోమతెర ఇంకొంచెం మందంగా ఉంటుంది’ అని కామెంట్ చేశాడు.
సేమ్ అలాంటి డ్రెస్ సమంత వేసుకుంటే ఓ నెటిజన్ ‘పలుచని చొక్కాలో సమంత ఇంటర్నెట్ హీట్ పెంచేలా ఉంది’ అని పొగిడాడు. ఈ రెండు కామెంట్లను ఫోటోతో సహా ఉర్ఫీ జావేద్ ట్వీట్ చేసింది. దాంతోపాటు ‘ నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకీపాటికే అర్ధం అయి ఉంటుంది. సమంతను కించపరచాలని నా ఉద్దేశం కాదు. ఒకరిని పొగుడుతూ, ఇంకొకరిని ఎందుకు కించపరుస్తారు’ అని నెటిజన్లకు తన ఆవేదనను వ్యక్తపరిచింది.