Urfi Javed said that she gets allergic if he wears clothes
mictv telugu

బట్టలు వేసుకోకపోవడానికి అసలు రీజన్ చెప్పిన ఉర్ఫీ జావెద్.. పాపం నిజమే భయ్యా

January 7, 2023

చిత్రవిచిత్ర బట్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. వేషధారణతో ఎంతో పాపులర్ అయిన ఈమెకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది ఉర్ఫీ డ్రెస్సింగ్ స్టైల్ ని విమర్శించగా, కొందరు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. మహారాష్ట్ర బీజేపీ మహిళా అధ్యక్షురాలు కూడా ఉర్ఫీపై కేసు పెట్టగా రాజ్యాంగంలో ఉన్న రూల్స్ మాట్లాడి విమర్శకుల నోర్లు మూయించింది. అంతేకాక, జైలుకెళ్తే ఇలా ఉంటానంటూ చేతులకు సంకెళ్లు వేసుకున్న ఫోటోలను పోస్ట్ చేసింది.

ఇదంతా ఎలా ఉన్నా తన వేషధారణ వెనుక ఉన్న అసలైన నిజాన్ని ఉర్ఫీ తాజాగా రివీల్ చేసింది. తనకు ఉన్ని డ్రెస్సులంటే పడదని సాక్ష్యాలతో సహా చూపించింది. తనకు దుస్తులంటే ఎలర్జీ అని కాళ్లకు దుద్దులు వచ్చిన ఫోటోను షేర్ చేసింది. ‘నేను దుస్తులు ఎందుకు ధరించనో అర్ధమైందా. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. నిండుగా కప్పి ఉంచే దుస్తులు వేసుకునేందుకు నా శరీరం ఒప్పుకోదు. అందుకే నేను ఎక్కువగా నగ్నంగా ఉంటాను. ముఖ్యంగా ఉన్ని దుస్తులేసుకుంటే పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది’ అంటూ రాసుకొచ్చింది ఉర్ఫీ. మరి ఈ వివరణ చూసాకైనా విమర్శలు ఆగుతాయేమో చూడాలి.