తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎర్ర భూములను గుట్టుచప్పుడు కాకుండా మైనింగ్‌కు ఇచ్చేస్తున్నారని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం పారుపల్లి గ్రామంలో ఆమె పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా తెలంగాణలోని ఎర్ర భూములను రక్షిస్తామని ఆమె పేర్కొన్నారు.’
‘ఆత్మకూరులో ఉన్న ఎర్రబోళ్లు భూముల్ని రక్షిస్తాం. ఆనాడు దివంగత సీఎం వైఎస్ఆర్ ఎర్రబోళ్ల భూములను కాపాడితే, ఈ కేసీఆర్ మైనింగ్ కోసం తాకట్టుపెడుతున్నారు. పేదలకు అన్యాయం జరిగితే సహించబోం. 127 ఎకరాల భూమి గ్రామంలో సర్వే నెంబర్ 279లో సుమారుగా 127ఎకరాల భూమి ఉంది. ఎళ్ల నుంచి ఆ భూముల్లో గిరిజనులు, గొర్రెకురుమలు బర్లు, గొర్లు కాచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా మైనింగ్‌కు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది” అని షర్మిల మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో గతంలో వైయస్ఆర్ భూములు కబ్జాకు గురికాకుండా, అటవీశాఖ స్వాధీనం చేసుకోకుండా కాపాడి, పేదల కోసం కేటాయించారని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆ భూముల్ని ప్రైవేటు మైనింగ్‌కు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని, అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేస్తానని షర్మిల అన్నారు.