us-agrees-to-sell-220-tomahawk-missiles-to-australia
mictv telugu

ఆస్ట్రేలియాకు టొమహాక్ క్షిపణులు

March 17, 2023

us-agrees-to-sell-220-tomahawk-missiles-to-australia

చైనాకు షాక్ ల మీద షాకులు ఇస్తోంది అమెరికా. మొన్నన్న ఆస్ట్రేలియాతో అణుశక్తి జలాంతర్గాముల సమకూర్చాలని ఒప్పందం చేసుకుది. ఇప్పుడు 220 టోమహాక్ దీర్ఘశ్రీణి మిస్సైల్స్ ని కూడా సరఫరా చేయాలని అమెరికా నిర్ణయం తీసుకుంది. ఇది చైనాకు చాలా పెద్ద భారీ షాక్ కానుంది.

జలాంతర్గాములు, యుద్ధనౌకల్లో వినియోగించే 220 టొమహాక్ మిస్సైల్స్ ను ఆస్ట్రేలియాకు సప్లై చేయాలని అమెరికా నిర్ణయించుకుంది. ఈ విణయాన్ని ఢిఫెన్స్ సెక్యూరిటీ కో పఆపరేషన్స్ ఏజెన్సీ స్వయంగా ప్రకటించింది. ఈ డీల్ విలు 895 మిలియన్ డార్లు. ఆకస్ డీల్ లో భాగంగానే ఈ కొనుగోళ్ళు కూడా జరుగుతున్నాయని అమెరికా స్పష్టం చేసింది. ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకునేందుకే దీన్ని చేస్తున్నామని ఇరు దేశాలు అంటున్నాయి. టొమహాక్ క్షపణులతో ఆస్ట్రేలియా బలం మరింత పెరిగిందని, దూరంగా ఉన్న శత్రువలపై దాడి చేసే సామర్ధ్యాన్ని కూడా తమ దేశం సంపాదించిందని ఆ దేశపు ప్రతినిధులు చెబుతున్నారు.

టొమహాక్ మిస్సైల్స్ ను అమెరికా 1991లో మొదటి సారి వాడింది. గల్ప్ యుద్ధంలో ఇవి అత్యంత తక్కవ ఎత్తులో సబ్ సోనిక్ వేగంతో ప్రయాణించి, రాడార్ల కళ్ళుగప్పి లక్ష్యాలను ఛేదించాయి. ఇవి వెయ్యి మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను చేరుకోగలవు. వీటిని నీటిలో నుంచి కూడా ఉపయోగించవచ్చును. ఇప్పటి వరకు ఈ టొమహాక్ క్షిపణులను అమెరికా దగ్గర నుంచి ఒక్క బ్రిటన్ మాత్రమే కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఆ లిస్ట్ లో చేరింది. అలాగే జపాన్ కూడా ఈ మిస్సైల్స్ సొంతంత చేసుకోవాలని అనుకుంటోంది.

బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇప్పటికే క్వాడ్‌ కూటమిని ఏర్పాటు చేసిన అగ్రరాజ్యం తాజాగా బ్రిటన్‌, ఆస్ట్రేలియాతో కలసి ఆకస్‌ కూటమిని అకస్మాత్తుగా తెరపైకి తెచ్చింది. కృత్రిమ మేథ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ భద్రత, జలాంతర్గాముల సామర్థ్యం, ఇతర అధునాతన రక్షణ వ్యవస్థల్లో సహకారం పెంపొందించుకోవడమే ఆకస్‌ ప్రధాన ఎజెండాగా ఉంటుందని కూటమి నేతలు బయటకు చెబుతున్నప్పటికీ దీని అసలు లక్ష్యం చైనాకు వ్యతిరేకంగా అణు యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేయడమేనని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు.అమెరికా, ఏ ప్రయోజనం లేనిదే ఆస్ట్రేలియాకు ఈ అణు టెక్నాలజీ బదిలీ చేస్తుందని అనుకోలేము. అమెరికా కట్టే ఏ కూటమి అయినా, అది కుదుర్చుకునే ఏ ఒప్పందం అయినా తన సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తుంది.ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో తనకు నమ్మకమైన కాపలాదారుగా వుంటూ, తన ప్రయోజనాలను నెరవేర్చడానికి ఆస్ట్రేలియాలోని మితవాద ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ పొందిన మీదటే అణు సబ్‌మెరైన్‌ టెక్నాలజీ ఇచ్చేందుకు అమెరికా అంగీకరించింది.

ఆకస్ కూటమి ఒప్పందం ప్రకారం 2030 ప్రారంభం నుంచి అమెరికా మూడు వర్జీనియా తరగతి జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు అమ్ముతుంది. అవి కాకుండా అవసరాన్ని బట్టి మరో రెండు సబ్ మెరైన్లను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఆస్ట్రేలియా సీఫోర్స్ కు అమెరికా, బ్రిటన్ లలో ట్రైనింగ్ ఇవ్వనుంది. అలాగే 2027 నుంచి ఆస్ట్రేలియాకు అణు జలాంతర్గాములను అమెరికా పంపుతుంది. వీటితో ఆస్ట్రేలియా మరింత బలోపేతం ఉంది. ఇప్పటి వరకు డీజిల్ సబ్ మెరైన్ లను మాత్రమే ఆ దేశం కలిగి ఉంది.