అమెరికా వీసా కావాలంటే ఫేస్‌బుక్ ఐడీ చెప్పాల్సిందే - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా వీసా కావాలంటే ఫేస్‌బుక్ ఐడీ చెప్పాల్సిందే

March 30, 2018

వలసలపై, వీసాలపై కఠిన అంక్షలు విధిస్తున్న అమెరికాలోని ట్రంప్ సర్కారు మరోరకం కొత్త తనిఖీకి తెరతీసింది. దరఖాస్తుదారులు గత ఐదేళ్లలో వాడిన ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే సోషల్ మీడియా వాడకానికి సంబంధించిన వివరాలూ ఇవ్వాల్సి ఉంటుందది. ఈమెయిల్స్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్‌టాగ్రాం వంటి ఖాతాల వివరాలు తెలిపారు. అలాగే గతంలో ఏఏ దేశాలు తిరిగారో చెప్పాలి.

ఈ డేటా ఆధారంగా అమెరికా ఐటీ టీమ్‌లు దరఖాస్తుదారుల గత చరిత్రను, నేరాలకు పాల్పడి ఉంటే ఆ వివరాలను తవ్వి తీస్తారు. కుటుంబ సభ్యుల వివరాలనూ తెలుసుకుంటారు. అనుమానం కలిగితే దరఖాస్తును తిరస్కరించడమేగాక, సంబంధిత సమాచారాన్ని ఆయా దేశాల ప్రభుత్వాలతో పంచుకుంటారు కూడా. అమెరికాకు ఉగ్రవాదుల నుంచి, శత్రుదేశాల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఈ వలసదారుల చరిత్రపై దృష్టి సారిస్తున్నారు. ఈ నిబంధనల ప్రభావం 7,10,000 ఇమిగ్రెంట్, 14 లక్షల నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తులపై ఉంటుందని భావిస్తున్నారు.