us bombed nord stream gas pipelines
mictv telugu

ఐరోపా మీద అమెరికా కుట్ర పన్నిందా?

February 10, 2023

 us bombed nord stream gas pipelines

రష్యాను దెబ్బ తీయడానికి అమెరికా మొత్తం ఐరోపాకు గ్యాస్ సరఫరా నిలిపేసిందని ఆరోపణలు వస్తున్నాయి. శీతాకాలం ఐరోపా దేశాలకు గ్యాస్ చాలా అవసరం. ఒకరకంగా ప్రాణ వాయువు అనే చెప్పాలి. అలాంటి దాన్ని ఐరోపాలోని మిత్ర దేశాలకు అమెరికా కావాలనే అందకుండా చేసిందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. రష్యాను ఆర్ధికంగా దెబ్బ తీయడానికే ఇలా చేసిందేమోనని అంటున్నారు. జర్మనీ దేశాలకు కీలకమైన నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్ లైన్ ను యూఎస్ఏ ఓ కోవర్ట్ ఆపరేషన్ లో పేల్చేసిందని అంటున్నారు సూపర్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ సిమౌర్ హెర్ష్. దీనికి జోబైడెనే ఆదేశాలు ఇచ్చరని కూడా అంటున్నారు.

హెర్ష్ మామూలు జర్నలిస్ట్ కాదు….ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో మంచి పేరున్నవాడు. రెండు సార్లు అమెరికా గుట్టును బట్టబయలు చేసింది. 1968లో, 2004లో ఒకసారి. అమెరికా ఈయన చెప్పింది నిజం కాదని బుకాయించింది కానీ చివరికి అదే నిజమని తేలింది. అలాంటి హెర్షే ఇప్పుడు గ్యాస్ పైప్ లైన్ విషయాన్ని కూడా బయటకు తీసుకొచ్చాడు. దీంతో అమెరికా-రష్యాల మధ్య విభేదాలు మరొకసారి భగ్గుమన్నాయి.

అసలేంటీ గ్యాస్ ఫైప్ లైన్:

రష్యాలో అత్యధికంగా సహజవాయు క్షేత్రాలు ఉన్నాయి. చౌవకగా గ్యాస్ ఎగుమతి చేసే దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఇక్కడి నుంచి గ్యాస్ ను జర్మనీకి సరఫరా చేయడానికి 1, 224 కిమీ పొడవునా బాల్డిక్ సముద్రంలో పైప్ లైన్ నిర్మించారు. గ్యాజ్ ప్రోమ్ అనే సంస్థ మరో నాలుగు ఐరోపా సంస్థలు కలిసి దీన్ని నిర్మించాయి. దీన్ని విస్తరిస్తామని 2015లో ప్రకటించారు కూడా. అయితే అమెరికా, మరికొన్ని ఐరోపా దేశాలు దీన్ని వ్యతిరేకించాయి. కానీ 2021లో దీని నిర్మాణం పూర్తయింది. దీనికి జర్మనీ నియంత్రణ సంస్థల నుంచి అనుమతి రాకపోవడంతో పక్కన పెట్టారు.

రష్యా ఉక్రెయిన్ మీద దాడి జరుగుతందని ముందుగానే పసిగట్టినప్పుడు అమెరికా, సీఐఏ లాంటి వాళ్ళు నార్డ్ స్ట్రీమ్ గ్యాప్ పైప్ లైన్ ను పేల్చేయాలని నిర్ణయించారు. దీనిని పేల్చేయడానికి ప్లాన్ సిద్ధం చేయాలని బైడెన్ సూచనతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సులేవాన్ సైనిక అధికారులను ఆదేశించారు కూడా. ఈ మొత్తం ఆపరేషన్ కోసం అమెరికా నిఘా సంస్థలు నార్వే సాయం తీసుకున్నాయి. పైపులైన్ పేల్చడానికి అనువైన ప్రాంతాలను నార్వే టార్ ఫోర్స్ అమెరికాకు చెప్పింది. అక్కడ నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత సెప్టెంబర్ 26వ తేదీన అమెరికా పీ‘ నిఘా విమానం ఆ ప్రాంతంలో ప్రయాణిస్తూ ప్రత్యేక సోనార్లను సముద్రంలో వదిలింది. వాటి సహాయంతో సీ4 అనే పేలుడు పదార్ధాలను అమర్చి, పైపులైన్లను ధ్వంసం చేశారు. మొత్తం పైన్ లైన్ లో 3చోట్ల లీకులు ఏర్పడ్డాయి.ఇదంతా హెర్ష్ ఒక ఆన్ లైన్ రీసెర్చ్ ఇంజన్ లో కథనంలా రాసారు. ఇదొక ఇన్విస్టిగేషన్ స్టోరీ. పైగా రష్యానే ఇదంతా చేసిందంటూ అమెరికా, నాటో లు ఆరోపణలు కూడా చేశాయి అని చెబుతున్నారు హెర్ష్. ఈ నార్డో పైప్ లైన్ పేలిపోవడం వలన ఐరోపా దేశాలు చాలా ఇబ్బందులు పడ్డాయి. గతిలేక అమెరికా, అజర్బైజర్ లాంటి దేశాల దగ్గర నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకున్నాయి.

ఆరోపణలను కొట్టిపడేసిన అమెరికా:

అయితే హెర్ష్ చేసిన ఆరోపణలను అమెరికా కొట్టిపడేసింది. అవన్నీ శుద్ధ అబద్ధాలని, కట్టుకథలని అంటోంది. మరోవైపు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, విదేశాంగ శాఖలు కూడా ఇదే చెప్పారు. స్వీడెన్, డెన్మార్క్ దేశాలు మాత్రం ఎవరి పేరూ చెప్పలేదు కానీ పైప్ లైన్లను ఉద్దేశపూర్వకంగానే పేల్చారని మాత్రం అంటున్నాయి. కానీ ఈ కథనం మీద రష్యా మాత్రం తీవ్రంగా స్పందించింది. ఈ కుట్ర చేసినవాళ్ళను వదిలేది లేదని చెప్పింది. మొదటి నుంచీ ఉక్రెయిన్ కు సాయం చేస్తూ అమెరికా రష్యాకు వ్యతిరేకంగానే ఉంది. ఇప్పుడు ఈ కథనంతో రెండు దేశాల మధ్య గొడవ మరింత ముదిరింది.