గత రెండున్నరేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. ఇంకా పలు దేశాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త వైరస్ ల భయం ప్రజలను వణకిస్తోంది. కొన్ని రోజుల క్రితం టామోటో వైరస్.. అందోళనకు గురిచేయగా తాజాగా మంకీ పాక్స్ వైరస్ పలు దేశాల్లో బయటపడడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కెనడాలో డజనుకు పైగా మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా అమెరికాలో కూడా మంకీ పాక్స్ కేసు నమోదయ్యింది. కెనడా నుండి వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు యూఎస్ ప్రకటించింది. కెనడా క్యూబెక్ ప్రావిన్సుల్లో 12కిపైగా అనుమానస్పద మంకీపాక్స్ కేసులను గుర్తించి చికిత్స అందజేస్తున్నారు.
కెనడా క్యూబెక్ ప్రావిన్సుల్లో 12కిపైగా అనుమానాస్పద మంకీపాక్స్ కేసులను గుర్తించి చికిత్స అందజేస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో ఐరోపా ఆరోగ్య అధికారులు డజన్ల కొద్దీ మంకీపాక్స్ కేసులను గుర్తించారు. మంకీపాక్స్ సోకితే తరచూ జ్వరం, కండరాలనొప్పి, ఫ్లూ లాంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడతారని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ‘‘మంకీపాక్స్ కేసు వల్ల ఇప్పటికిప్పుడు ప్రజలకు వచ్చే ప్రమాదం ఏం లేదు.. బాధితుడికి ప్రత్యేక ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది.. అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది’’ అని సీడీసీ (Centers for Disease Control and Prevention)తెలిపింది.