ఇమ్రాన్‌పై అమెరికా కుట్ర : రష్యా - MicTv.in - Telugu News
mictv telugu

ఇమ్రాన్‌పై అమెరికా కుట్ర : రష్యా

April 5, 2022

bbbbb

పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభంపై రష్యా స్పందించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రష్యాలో పర్యటించినందుకే అమెరికా ఆయనను దింపే కుట్రకు పాల్పడిందని ఆరోపించింది. అమెరికా కుట్ర ప్రకారమే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టబడిందంటూ ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందు ఇమ్రాన్ పలు ర్యాలీల్లో ప్రజలనుద్దేశంచి చేసిన ప్రసంగంలో పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావించారు. తనను పదవి నుంచి దింపడానికి ఓ విదేశీ శక్తి పనిచేస్తోందని, అందుకు తన వద్ద ఆధారాలున్నాయని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో అందరూ అమెరికా వైపు అనుమానంగా చూడడంతో ఆ దేశం ఈ విషయంపై క్లారిటీనిచ్చింది కూడా. ఈ విషయంపై ఆ దేశంలోని మరో అధికార కేంద్రమైన సైన్యం స్పందించింది. ‘అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ హస్తం ఉందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. అమెరికా ఎలాంటి లేఖలను పంపలేద’ని ఆర్మీ వర్గాలు స్పష్టతనిచ్చాయి. ఇదిలా ఉండగా, ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ‘పాకిస్తాన్‌ను చూసి ప్రపంచం నవ్వుతోంది. చివరి బంతి వరకు ఆడతానని చెప్పిన వ్యక్తి, ఇప్పుడు వికెట్లను తీసుకొని పారిపోయా’రంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.