ట్రంప్‌కు రక్షణ మంత్రి షాక్..సైన్యాన్ని దించే ప్రసక్తే లేదని.. - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్‌కు రక్షణ మంత్రి షాక్..సైన్యాన్ని దించే ప్రసక్తే లేదని..

June 5, 2020

us Defence leaders say no to Trump’s troops idea

అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా జరుగుతోన్న నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు అధ్యక్షుడు ట్రంప్ సైన్యాన్ని దింపుతానని ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే, ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా రక్షణ శాఖా ఉన్నతాధికారులు అడ్డుకట్ట వేస్తున్నారు. 

తాజాగా రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ సైన్యాన్ని దింపే ప్రక్రియను తిరస్కరించారు. సైన్యం దించడం చివరి ఆప్షన్ అని, ఇప్పట్లో అవసరం లేదని మార్క్ తెలిపారు. మార్క్ ఆస్పర్ బహిరంగంగా ట్రంప్ ప్రయత్నాలను తిరస్కరించడం గమనార్హం. వీధుల్లో ప్రదర్శనలను అణిచివేసేందుకు సైన్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగిస్తామన్న ట్రంప్ హెచ్చరికలను మార్క్ బేఖాతరు చేశారు. ఈ సందర్భంగా ఆస్పర్ మాట్లాడుతూ..’శాంతిభద్రతలను కాపాడటానికి, సైన్యాన్ని ఉపయోగించరు. సైన్యాన్ని కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలి.’ అని అన్నారు. అయినా కూడా ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించాలని ట్రంప్ గవర్నర్‌లపై ఒత్తిడి తెస్తున్నారు.