కరోనా సాయం.. ఒక్కొక్కరి  ఖాతాలో రూ. 91వేలు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా సాయం.. ఒక్కొక్కరి  ఖాతాలో రూ. 91వేలు

March 25, 2020

US government distributing $1,200 for all

కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను సైతం వణికిస్తోంది. మంగళవారం ఒక్కరోజే అమెరికాలో 10 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 54 వేలకు చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 150 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 784కు చేరింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. 

పరిస్థితిని అదుపులో పెట్టడనికి అమెరికా ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చరిత్రలో తొలిసారి 2 ట్రిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. దీనికి వైట్‌హౌస్, సెనేట్ ప్రతినిధుల బృందం మద్దతు తెలిపింది. ఈ ప్యాకేజీ వల్ల అమెరికాలోని పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, సాధారణ ప్రజలు లబ్ది పొందనున్నారు. ప్యాకేజీలో 500 బిలియన్ డాలర్లను పరిశ్రమల కోసం కేటాయిస్తారు. దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో సుమారు 1200 డాలర్లు (రూ.91 వేలు) డిపాజిట్ చేయనున్నారు. చిన్నపిల్లలకు ఒక్కొక్కరికి 500 డాలర్లు (సుమారు రూ.38వేలు) అందజేస్తారు.