చైనాను దాటేసిన అమెరికా..ఒక్కరోజే 17000 కేసులు  - MicTv.in - Telugu News
mictv telugu

చైనాను దాటేసిన అమెరికా..ఒక్కరోజే 17000 కేసులు 

March 27, 2020

US has highest number of coronavirus cases in world

అమెరికాపై కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య చైనాను దాటేసింది. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 85,594కు చేరింది. ఈ మహమ్మారి కారణంగా అమెరికాలో 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఒక్కరోజే 17వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

అమెరికాలోని ప్రధాన నగరమైన న్యూయార్క్‌లో వైరస్‌ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికైనా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించాలని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, నిపుణులు సూచిస్తున్నారు. కరోనా పుట్టిల్లు చైనాలో ఇప్పటి వరకు 81,340 కేసుల నమోదు అయ్యాయి. ఆ సంఖ్యను అమెరికా దాటేసింది. యూరప్‌లోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇటలీలో 80,589, స్పెయిల్‌లో 57,786, జర్మనీ 43,938 కేసులు నమోదు అయ్యాయి.