రెచ్చిపోయిన లవర్.. రూ. 40 కోట్ల కళాఖండాలు ధ్వంసం - MicTv.in - Telugu News
mictv telugu

రెచ్చిపోయిన లవర్.. రూ. 40 కోట్ల కళాఖండాలు ధ్వంసం

June 7, 2022

ప్రేయసితో గొడవపడిన యువకుడు.. కోపంతో చేతికందినవన్నీ ధ్వంసం చేశాడు. ధ్వంసం చేసిన ఆ వస్తువుల విలువ అక్షరాలు రూ.400 కోట్లు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని డల్లాస్ లో ఫేమస్ ప్లేస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లోకి 21 ఏళ్ల బ్రియాన్ హెర్నాండెజ్ అనే యువకుడు చొరబడ్డాడు. మ్యూజియంలోకి చేరుకున్నాక అక్కడున్న వస్తువులను ఒక్కొక్కటిగా ధ్వసం చేశాడు. మ్యూజియం సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. మ్యూజియం ఎంట్రెన్స్ గెట్ దగ్గర రాత్రి కుర్చీలో కూర్చున్న బ్రియాన్ ను పోలీసులు గుర్తించారు. ఎందుకిలా చేశావ్ అని అడగ్గా.. అతడు చెప్పిన సమాధానం విని వారు షాక్ అయ్యారు. తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియురాలితో గొడవ జరిగిందని.. ఆ కోపాన్ని తట్టుకోలేక.. కోపాన్ని తగ్గించుకోవడానికి మ్యూజియంలో అరుదైన వస్తువులను పగలగొట్టినట్లు చెప్పాడు.

బ్రియాన్ ధ్వసం చేసిన అరుదైన విలువైన పురాతన కళాకండాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. 6 వ శతాబ్దపు గ్రీకు విగ్రహం, 450 BC నాటి కుండతో సహా ఒక కైలిక్స్ హెరాకిల్స్ , నెమియన్ లయన్ విగ్రహం (భారత దేశ కరెన్సీలో సుమారు రూ.77 లక్షలు) ఉన్నాయని తెలిపారు. అతడు నష్టం చేసిన వస్తువుల విలువ 5.2 మిలియన్ డాలర్లు మన దేశ కరెన్సీలో సుమారు.. రూ.40.37 కోట్లు ఉంటుందని మ్యూజియం నిర్వాహకులు అంచనా వేశారు.