US Orders Tata-Led Air India To Pay $121.5 Million As Passenger Refunds
mictv telugu

ఎయిర్ ఇండియాకు అమెరికా షాక్

November 15, 2022

ప్రయాణికులకు రిఫండ్లు చెల్లించే విషయంలో ఎయిర్ ఇండియా అలసత్వం ప్రదర్శించిందని, వెంటనే వాటిని చెల్లించాలని అగ్రరాజ్యమైన అమెరికా ఆదేశించింది. 121.5 మిలియన్ డాలర్ల (రూ.988కోట్లు) రీఫండ్లతో పాటు.. పెనాల్టీ రూపంలో మరో 1.4 మిలియన్‌ డాలర్ల (రూ.11కోట్లు) జరిమానా కట్టాలంటూ తన ఆదేశాల్లో పేర్కొంది.

కరోనా మహమ్మారి సమయంలో అమెరికాకు వెళ్లే/వచ్చే పలు విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. దీంతో ఆ విమాన టికెట్ల రీఫండ్‌ విషయమై ప్రయాణికులు అమెరికా రవాణా విభాగానికి ఫిర్యాదులు చేశారు. దీంతో ఆ ఫిర్యాదులను పరిష్కరించి రీఫండ్లు ఇవ్వాలని అమెరికా అధికారులు విమానయాన సంస్థను కోరారు. అప్పటికి ఎయిరిండియా ఇంకా టాటా చేతుల్లోకి వెళ్లలేదు. అమెరికా ర‌వాణాశాఖ సోమ‌వారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్ ఇండియాతో పాటు మ‌రో ఆరు ఎయిర్‌లైన్ సంస్థ‌ల‌కు ఈ ఫైన్ విధించింది.

అయితే రిఫండ్ విధానంలో అమెరికాకు, ఎయిర్ ఇండియా పాల‌సీలో తేడాలు ఉన్నాయి. ఎయిర్‌లైన్లు తమ విమానాలను రద్దు చేయడం లేదా విమాన సమయాల్లో మార్పులు చేసినప్పుడు.. ప్రయాణికుల టికెట్లను చట్టబద్ధంగా రీఫండ్‌ చేయాల్సి ఉంటుంది. క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ఎయిర్ ఇండియా సంస్థ‌ను అప్ప‌టికి టాటా సంస్థ టేకోవ‌ర్ తీసుకోలేదు.